Waltair Veerayya 10 Days Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు పది రోజులు కావస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి రవితేజ అన్నదమ్ములుగా నటించగా వారి సరసన కేథరిన్ థెరిసా, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా మునుపెన్నడూ లేని విధంగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ఇప్పటికే 10 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పది రోజుల్లో వసూళ్ల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 95 కోట్ల మూడు లక్షలు షేర్, 153 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆరవ రోజు తర్వాత వసూళ్లు నెమ్మదిగా డ్రాప్ అవుతూ వచ్చాయి కానీ పదవ రోజు మాత్రం మరోసారి భారీ ఎత్తున వసూళ్లు నమోదయ్యాయి.


ఆదివారం కలిసి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో ఆదివారం నాడు ఆరు కోట్ల 66 లక్షలు వసూలు చేసింది. ఇక ఈ దెబ్బతో ఈ సినిమా పదో రోజు నాన్ రాజమౌళి రికార్డు బద్దలు కొట్టారు. ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్ మూవీ 16.10 కోట్లు, బాహుబలి 2 సినిమా 8.55 కోట్లు కలెక్ట్ చేయగా ఆ తరువాత ఈ సినిమానే నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పది రోజులకు గాను 114 కోట్ల 13 లక్షల షేర్ వసూలు చేస్తే 195 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూలు చేసింది.


ఇక వాల్తేరు వీరయ్య సినిమా ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకోవడంతో ఈ సినిమా 89 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవుతుందని నిర్ణయించారు. అయితే ఆసక్తికరంగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాతిక కోట్ల 13 లక్షల లాభాలతో ముందుకు దూసుకువెళుతోంది. ఒక 10 రోజులకే గాను కర్ణాటక సహా మిగతా భారతదేశంలో 7 కోట్ల 35 లక్షల వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో దాదాపుగా 11 కోట్ల 75 లక్షలు వసూలు చేసింది.


Also Read: Vaarasudu Collections: దిల్ రాజుకు షాక్.. వారసుడు బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎందుకో తెలుసా?


Also Read: Veera Simha Reddy 11 Days: 11వ రోజు వీర సింహం జోరు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకెంత దూరమంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook